రూమర్స్ పై స్పందించిన సుమ,అనసూయ

6
suma and anasuya condemns on rumors

రూమర్స్ రకరకాలుగా ఉంటాయి. వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపే రూమర్స్ కొన్ని అయితే, కెరీర్ పై ప్రభావం చూపేవి మరికొన్ని ఉంటాయి. అయితే ప్రముఖ యాంకర్లు సుమ, అనసూయ ఇళ్లలో జీఎస్టీ అధికారులు సోదాలు జరిగాయంటూ విస్తృతంగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈంపధ్యంలో సుమ, అనసూయలు విడివిడిగా స్పందిస్తూ, తమ ఇళ్లపై సోదాలు జరిగాయని వస్తున్న వార్తలను వారు ఖండించారు. అందులో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు.

ఈ మేరకు సుమ ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్‌ చేయగా, అనసూయ కూడా సోషల్ మీడియాలో ఈ వార్తలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘సుమ ఇంటిపై జీఎస్టీ దాడులు జరిగాయని వస్తున్న వార్తలు నిరాధారమైనవి. నేను చాలా ప్రాంప్ట్‌గా జీఎస్టీ చెల్లిస్తున్నా. అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయి. ఇలాంటి గాసిప్స్‌ నేను ఖండిచకపోతే, పది మంది నోళ్లలో నాని అదే నిజం అవుతుంది.. అందువల్లే నేను ఖండిచాల్సి వచ్చింది. వీటిని నమ్మకండి’ సుమ తెలిపారు.

‘ఇతరుల జీవితాలను బేస్‌ చేసుకుని తప్పుడు వార్తలను సృష్టించడానికి కొందరు ఇష్టపడతారు. వార్తల్లోని వాస్తవాలు తెలుసుకోకుండా మీడియా సంస్థలు కూడా వాటిని ప్రసారం చేయడం విచారకరం. నకిలీ వార్తల వల్ల వారికి కలిగే నష్టాన్ని ఒక్కసారి ఊహించుకోండి. మనుషులు ఎందుకు మానవత్వాన్ని మార్చిపోతున్నారు?. ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించడం కూడా ఒక నేరం. దయచేసి ఒకరి గురించి ఏదైనా వార్తను ప్రచురించే ముందు వాటిని ఒక్కసారి నిర్ధారణ చేసుకోవాలి’ అని అనసూయ కోరారు.