సయ్యద్ అహ్మద్ బుఖారీ సంచలన వ్యాఖ్యలు  

4
syed ahmed bukhari

 కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన  పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు రేగుతున్న వేళ.. తాజాగా ఢిల్లీలోని ప్రముఖ జామా మసీదు ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం కల్గించాయి. మోడీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం కలిగించదని, ఇది కేవలం ఇతర దేశాల నుంచి వచ్చే ముస్లిం శరణార్దులకు మాత్రమే వ్యతిరేకమ ని ఆయన స్పష్టంచేశారు.

   ఊహించని రీతిలో తెర మీదకు వచ్చి  ఈయన  చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోడీని రిలాక్స్ అయ్యేలా చేసిందని అంటున్నారు.పౌరసత్వ సవరణ చట్టం.. జాతీయ పౌర పట్టిక గురించి ఇమామ్ బుఖారి  మాట్లాడారు. నిరసన తెలపటం ప్రజాస్వామ్యంలో ఉండే హక్కు అని, నచ్చని అంశం మీద నిరసన తెలియజేయటాన్ని ఎవరూ అడ్డుకోలేరని  అయితే, ఇలాంటివి శాంతియుతంగా జరగాలే కానీ, ఇష్టారాజ్యంగా చేయకూడదని చెప్పుకొచ్చారు.

   ఎవరైనా ఆందోళన చేస్తే, భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకొని నిరసనలు చేపట్టాలే గానీ హింసాత్మక ఘటనలు తగవని బుఖారి స్పష్టంచేశారు.  తాజా చట్టంతో భారతదేశ ముస్లింలకు ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. జామా వర్సిటీ రణరంగంగా మారిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలన్న సయ్యద్ మాటలు ఇప్పుడున్న పరిస్థితులు మోడీ సర్కారుకు అంతో ఇంతో మేలు చేకూరుస్తాయని విశ్లేషకులు అంటున్నారు