షాకింగ్ న్యూస్ : బిజెపి తో పొత్తు కు టీడీపీ రెడీ..పొత్తులాంటిదట..!!

47
TDP Ready To Merge In BJP

టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు ఆ పార్టీ నేతలు బీజేపీ మద్దతు కోరారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను టీడీపీ నేత ఆలపాటి రాజా కలిశారు. ఈ సందర్భంగా దీక్షకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజా సమస్యలపై ఎవరూ పోరాడినా తమ సంఘీభావం ఉంటుందని, ఇసుక కొరతపై తొలి నుంచి పోరాడుతోంది బీజేపేనని కన్నా చెప్పారు. జనసేనాని పవన్ లాంగ్‌మార్చ్‌కు కూడా సంఘీభావం తెలిపామని చెప్పారు. అయితే టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రెండు సార్లు పొత్తు పెట్టుకుని నష్టపోయామని, భవిష్యత్‌లోనూ టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని కన్నా లక్ష్మీనారాయణ తోచిపుచ్చారు.

ఏపీ రాజకీయాలు ఇసుక చుట్టు తిరుగుతున్నారు. ఇసుక కొరతపై టీడీపీ, జనసేన, బీజేపీలు పోరాటం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇసుక కొరతపై ఈ నెల 14న చంద్రబాబు ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్ష చేయాలని అనుకున్నారు. అయితే దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో టీడీపీ అధిష్టానం వేదికను మార్చింది. విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద దీక్ష నిర్వహిస్తున్నట్టు టీడీపీ నేతలు తెలిపారు. ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని కార్మికులకు రూ.10 వేల భృతి ఇవ్వాలని, ఆత్మహత్యకు పాల్పడిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షలు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చంద్రబాబు ఈ దీక్ష చేస్తున్నట్లు ఆ పార్టీ చెబుతోంది.