నటుడు పృథ్వీకి పోసాని గట్టిగానే ఇచ్చుకున్నాడు

9
posani krishna murali and prudhvi raj

ఎన్నికల ముందు జగన్ కి మద్దతుగా నిల్చి పాదయాత్రలో సైతం పాల్గొన్న నటుడు, రచయిత,దర్శకుడు పోసాని కృష్ణ మురళి ఎవరైనా తప్పుగా మాట్లాడితే దుమ్ముదులిపేస్తాడు. తాజాగా రాజధాని రైతులపై ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ వ్యాఖ్యలకు వీరలెవెల్లో కౌంటరిచ్చారు. 3 పంటలు పండే భూముల్ని రాజధాని కోసం వదులుకున్నారని, రైతులు చొక్కా, ప్యాంట్లు వేసుకోకూడదా? అని పోసాని ప్రశ్నించారు. రాజధాని రైతుల్ని పెయిడ్‌ ఆర్టిస్టులు అన్న పృథ్వీ సిగ్గుపడాలన్నారు. ఎవరు పెయిడ్‌ ఆర్టిస్టులు? అమరావతి ఆడపడుచులా? అమరావతిలో ఉన్న కమ్మ వాళ్లా? అని పోసాని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఆడపడుచులకు పృథ్వీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు. ఐదేళ్ల ప్రభుత్వాన్ని 6 నెలలు కాకుండానే భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ను అన్‌పాపులర్‌ చేయడానికి పృథ్వీ ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి గాడు అని ఆడవాళ్లు తిడుతున్నారంటే, అది పృథ్వీలాంటి వాళ్ల వల్లేనని చెప్పారు. పృథ్వీ ఎవరి తరపున మాట్లాడారో చెప్పాలని పోసాని నిలదీశారు.
పృథ్వీ వ్యాఖ్యలను మంత్రులు సమర్థిస్తే ఇక తాను మాట్లాడనని, తన దారి తాను చూసుకుంటానని పోసాని పేర్కొన్నారు. పృథ్వీలాంటి సినిమా వాళ్లు మూడు, నాలుగేళ్లలో వచ్చి చేరారని చెప్పారు. తనతో పాటు ఎమ్మెల్యే రోజా పదేళ్ల నుంచి ఉన్నామని చెప్పుకొచ్చారు. రైతులంటే అడుక్కుతినే వాళ్లే ఉంటారా? ఆత్మాభిమానం ఉన్న రైతుల్ని అవమానిస్తారా అని అయన నిలదీశారు. 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఎంత ఆవేదన ఉంటుందన్నారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు జగన్‌ అంటే ద్వేషమని పోసాని దుయ్యబట్టారు.