ఏపీని 6 ప్రాంతాలుగా గుర్తించిన బోస్టన్ కమిటీ..!!

5
The Boston Committee identifies the AP as 6 regions

ఆంధ్రప్రదేశ్‌ను ఆరు ప్రాంతాలుగా గుర్తించి ఆపై అభివృద్ధిపై దృష్టి సారించాలని బీసీజీ కమిటీ సూచించింది. మీడియా తో మాట్లాడినా ప్లానింగ్ డైరెక్టర్ విజయ్‌కుమార్‌  బీసీజీ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిందని చెప్పారు అయితే ఆంధ్రప్రదేశ్‌కు రూ.2లక్షల కోట్ల అప్పు ఉందని, అప్పుల వల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇబ్బందిగా ఉందని వివరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, వ్యవసాయం విషయంలోనూ చాలా అసమతుల్యత ఉన్నట్లు చెప్పారు.

కృష్ణా, గోదావరి బేసిన్‌లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తి ఎక్కువగా ఉందని, రాష్ట్రానికి ప్రకృతి సంపద ఉన్నప్పటికీ సరిగా ఉపయోగించుకోలేదని స్పష్టం చేశారు. విశాఖ నుంచి చెన్నై వరకు రోడ్‌ కనెక్టివిటీ ఉందన్నారు. విశాఖలో మాత్రమే ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ సర్వీసులు, పోర్టులు అభివృద్ధి చెంది ఉన్నాయన్నారు. 8 జిల్లాల్లో పారిశ్రామిక వృద్ధి చాలా తక్కువగా ఉందని, అలాగే తలసరి ఆదాయంలో ఏపీ చాలా వెనుకబడి ఉందని ఆయన తెలిపారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో, ప.గో., కడప, కర్నూలు జిల్లాల్లో పారిశ్రామిక ఉత్పత్తి తక్కువ ఉన్నట్లు కూడా ఆయన వివరించారు

________________________________________________________________________