జనసేన పార్టీ లాంగ్ మార్చ్…..విమర్శలు ఎక్కుపెట్టిన వైసీపీ నేతలు

4
Jana Sena Party's Long March… ..

రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ జనసేన పార్టీ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగానే కదలివచ్చారు అయితే, అన్ని ప్రతిపక్ష పార్టీలను ఒక్క చోట చేర్చాలనే పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు మాత్రం ఈ సమయంలో ఫలించలేదు. ఇకపోతే కేవలం తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రమే నేతలు, కార్యకర్తలు లాంగ్ మార్చ్‌కు హాజరయ్యారు.

పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి అడగగానే ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన చంద్రబాబు నాయుడు తమ పార్టీ తరపున నేతలను పంపించాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడును లాంగ్ మార్చ్‌కు వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ లాంగ్ మార్చ్ కు అయ్యన్న, అచ్చెన్నాయుడు హాజరై ప్రసంగించారు. కానీ, గంటా శ్రీనివాసరావుకు మాత్రం చంద్రబాబు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ లాంగ్ మార్చ్‌కు దూరంగా ఉన్నారు. ఇకపోతే నిన్న నిర్వహించిన లాంగ్ మార్చ్ కార్యక్రమంపై వేడి వేడి చర్చలు, వాదనలు కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా ‘చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ తో వైజాగ్ షో పూర్తి అయిందనిపించాడు ఈ ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్. అంతే కాకుండా కాల్షీట్ సంస్కృతిని రాజకీయాల్లో ప్రవేశపెట్టిన వ్యక్తులు నీతి, నిజాయతీల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. అంటూ విజయ సాయిరెడ్డి ట్వీట్ కూడా చేశారు. ఇకపోతే నిన్న మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు మధ్యాహ్నం 3 గంటలకు ఈ లాంగ్ మార్చ్ జరిగిన విషయం తెలిసిందే.

దాదాపు 2.5 కి.మీ.మేర కొనసాగిన ఈ మార్చ్ కు లాంగ్ మార్చ్ అంటూ పేరు పెట్టడంపై కూడా విజయ సాయిరెడ్డి సెటైర్లు వేసారు. ఇకపోతే చంద్రబాబు అజెండాను మోయడానికే పవన్ ప్రయత్నిస్తున్నారని ఒకరకంగా లోకం పోకడ తెలియని లోకేష్ చంద్రబాబుకు చిన్న కొడుకైతే పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్న పెద్దకొడుకుగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు.