సౌందర్య లేని లోటు ఇప్పుడింకా ఎక్కువ తెలుస్తోంది

5
Arjun

ఒకప్పుడు యాక్షన్ హీరోగా భాషతో నిమిత్తం లేకుండా అన్ని భాషల సినిమాలో నటించి మెపించిన నటుడు అర్జున్ హీరోగానే కాదు, కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసి తన సత్తా చాటాడు. తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ ఇలా అన్ని భాషల్లో కూడా అర్జున్ అంటే మా హీరో అని ఆడియన్స్ చేత అనిపించుకున్నాడు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.

అర్జున్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇపుడు కీలక పాత్రలతో పాటు, విలన్ గా కూడా చేస్తున్నాడు. అయితే నటన వైపు వచ్చాక ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని అర్జున్ చెప్పుకొచ్చాడు. ప్రతి ఘటనను ఓ పాఠంగా మలచుకుని ధైర్యంగా అడుగులు ముందుకి వేస్తున్నానని చెప్పాడు. తనకు ఎందరో మంచి ఫ్రెండ్స్ పరిచయమయ్యారని,అందులో జగపతి బాబు,సౌందర్య ఉన్నారని అర్జున్ చెప్పుకొచ్చాడు. మిస్ యు అనే పదానికి అర్ధం సౌందర్య పోయాక తెల్సిందన్నాడు.

సౌందర్య అందానికి మించిన అభినయం గల నటి అని అర్జున్ చెప్పాడు. అన్ని మంచి లక్షణాలు కలగలిపితే సౌందర్య అవుతుందని అన్నాడు. ఓ హీరోయిన్ ని ఇంతలా ఆరాధిస్తానని ఎప్పుడూ అనుకోలేదని,ఆమె పోయాక ఆమె విలువ ఎక్కువగా తెలుస్తోందని వివరించాడు. అన్ని గుడ్ క్వాలిటీస్ ఉండడం వల్లనే ఆమె మన మధ్య లేదేమోనని ఆవేదనగా చెప్పాడు. తన జీవితంలో ఆమె లేని లోటు స్పష్టంగా తెలుస్తోందని అన్నాడు.