రష్మిక తో అందుకే చెడిందట రక్షిత్ షాకింగ్ కామెంట్స్

5
This is why Rashmika is so spoiled with Rakshit shocking comments

తెలుగు ఇండస్ట్రీలో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి, గీత గోవిందంతో రష్మిక మందన్న స్టార్ అయింది. దేవదాస్, డియర్ కామ్రేడ్ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో గిరాకీ అలానే ఉంది. కాగా రెండేళ్ల కింద ఈమెకు కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం అయింది. కిరిక్ పార్టీ సమయంలోనే అతడి ప్రేమలో పడింది. కానీ పెళ్లివరకూ అడుగు పడలేదు. రక్షిత్ మాత్రం ఆమె టాపిక్ వస్తే, హార్ట్ టచ్ అవుతున్నట్లు ఫీల్ అవుతున్నాడు. అందుకే ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఆన్సర్ లో దాటవేత ధోరణి చూపిస్తున్నాడు.

విజయ్ దేవరకొండతో రష్మిక క్లోజ్ నెస్ చూసి రక్షిత్ తట్టుకోలేకపోయాడని అప్పట్లో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కారణాలేమైనా ఈ జంట నిశ్చితార్థం అయ్యాక ఏడాది తిరక్కుండానే రద్దు చేసుకున్నారు. అయినా ఇప్పుడు దీనిపై మళ్లీ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రక్షిత్ శెట్టి కెజియఫ్ తరహాలోనే అతడే శ్రీమన్నారాయణ సినిమా చేస్తున్నాడు. ఇది తెలుగులోనూ వస్తున్న నేపథ్యంలో రష్మిక గురించి రక్షిత్ ని ప్రశ్నిస్తే, మొదట్లో ఇద్దరం ఒకరిని ఒకరు ఇష్టపడ్డామని, అందుకే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నామని చెప్పాడు. అయితే రష్మిక కలలు ఎక్కువని, రక్షిత్ చెబుతూ అందుకే ఆమె కల నెరవేరాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

దయచేసి ఈ విషయంలో ఆమెను కూడా ఇబ్బంది పెట్టొద్దని రక్షిత్ రిక్వెస్ట్ చేసాడు. ఇక రష్మిక కూడా ఇలాగే స్పందించింది. ప్రేమించుకున్నాం కాబట్టే పెళ్లి వరకు తీసుకొచ్చామని, కానీ ఇద్దరికి సినిమాలలో రాణించాలనే కోరిక ఉండటంతో పెళ్లిని రెండేళ్లు వాయిదా వేసుకున్నామని చెప్పుకొచ్చింది. అయితే అప్పటికే ఛాన్స్ లు ఎక్కువైపోవడంతో పెళ్లి చేసుకుంటే సినిమాలకు న్యాయం చేయలేనని, నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక పెళ్లి రద్దు చేసుకున్నట్టు చెప్పింది. ఈ నిర్ణయం తీసుకోవడంపై రష్మిక అయితే పెద్దగా ఫీల్ అయినట్లు కనిపించడం లేదు. తాజాగా మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో భీష్మ సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు కూడా రష్మిక కమిట్ అయింది.