ప్రభాస్ మిస్ అయిన టాప్ 10 బ్లాక్ బస్టర్స్

60
Top 10 Bolckbusters Missed By Prabhas

బాహుబలి స్టార్ ప్రభాస్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా, ప్రభాస్ మిస్డ్ బ్లాక్ బస్టర్ చిత్రాలను మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఇక్కడ మేము మీకు ఎందుకు ‘బ్లాక్ బస్టర్స్’ అని చెప్తున్నామంటే ఆయన వదులుకున్న అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపాయి.

ప్రభాస్ వదులుకున్న సినిమాల లిస్ట్ :

1. ఒక్కడు:

ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్. ఈ చిత్రం మహేష్ బాబును నిజమైన సూపర్ స్టార్ చేసింది. అయితే, ఈ చిత్రం మొదట ప్రభాస్‌కు వెళ్ళింది. దర్శకుడు గుణశేఖర్ ఈ కథను ప్రభాస్ మరియు అతని తండ్రి కృష్ణరాజుకు వివరించారు. కానీ కబడ్డీ ఆటను పరిగణనలోకి తీసుకుంటే స్క్రిప్ట్ కొంచెం రిస్క్ అని ప్రభాస్ బావించి స్క్రిప్ట్ నుండి తప్పుకున్నారు.

2.దిల్: 


ప్రభాస్ తన మొదటి చిత్రం ఈశ్వర్ నుండి వినాయక్ తో పాటు దిల్ రాజుతో మంచి స్నేహం కలిగి ఉన్నాడు. ఈ స్నేహం తోనే వి.వి.వినాయక్ ప్రభాస్‌తో కలిసి పనిచేయడానికి చాలా ఇష్టపడేవాడు. కాబట్టి అతను ఈ కథను ప్రభాస్‌తో వివరించాడు. కానీ ప్రభాస్ మరో సినిమాతో కాస్త బిజీగా ఉండటం తో ఈ సినిమాను తిరస్కరించాడు.

3. సింహాద్రి:


ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.  ఈ సినిమాతో ఎన్టీఆర్  రాజమౌళి మొదట ఈ స్క్రిప్ట్‌ను ప్రభాస్‌తో డిస్కస్ చేశాడు.  కానీ ఈ బరువును నేను మోయలేనేమో అని భావించిన ప్రభాస్ ఈ కథని తిరస్కరించాడు

4. ఆర్య:


అల్లు అర్జున్, సుకుమార్ ఈ చిత్రంతో  తెలుగు ప్రేక్షకుల మదిలో మేజిక్ సృష్టించారు. ఈ సినిమా కథ మొదట ప్రభాస్‌కు సుకుమార్, దిల్ రాజు వివరించారు. అయితే, మన డార్లింగ్ ప్రభాస్ ఈ స్క్రిప్ట్ పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. తరువాత అది అల్లారి నరేష్ వద్దకు వెళ్లి, అల్లరి నరేష్ కూడా తిరస్కరింరించడంతో అల్లు అర్జున్ వరకు వెళ్ళి ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది.

5. బృందావనం:


బృందావనం లాంటి ఫ్యామిలీ సినిమాను ప్రభాస్ మిస్ అయ్యారు. వంశీ పైడిపల్లి ఈ కథను ప్రభాస్‌తో వివరించాడు మరియు ప్రభాస్ కూడా దీనికి ఆసక్తి చూపించాడు . అయితే, ప్రభాస్ ఇప్పటికే ‘డార్లింగ్’ మరియు ‘మిస్టర్ పర్ఫెక్ట్’  అనే రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను చేస్తూ ఉండటం తో ఈ సినిమాను వదిలిపెట్టాడు.

6) నాయక్:


దర్శకుడు వి.వి.వినాయక్ ప్రభాస్‌కు మంచి స్నేహితుడు అందుకే ఈ కథను కూడా మన డార్లింగ్ కి వివరించాడు . అయితే ఇప్పటికే మిర్చి, రెబెల్ లతో బిజీగా ఉన్న ప్రభాస్ తన తేదీలను సర్దుబాటు చేయలేకపోయాడు . తరువాత వినయక్ ఈ కథను పవన్ కళ్యాణ్ కు వివరించాడు. చివరగా, ఇది రామ్ చరణ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

7.కిక్:


రవితేజ అభిమానులను రెట్టింపు చేసిన  చిత్రం ‘కిక్’ మొదట ప్రభాస్‌ వద్దకు వెళ్లింది. అయితే, ప్రభాస్ ఒప్పుకుందామా వద్దా అనే స్థితి లో ఉండగానే రవితేజ  ఓకే అన్నారు, సినిమా మొదలైంది.

8. ఊసరవెల్లి:


ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కానప్పటికీ, ఎలివేషన్ సన్నివేశాలు కొన్ని ఖచ్చితంగా ప్రభాస్‌ హీరోగా వర్కవుట్ అవుతాయి. కథ విన్న తరువాత ప్రభాస్ ఈ చిత్రానికి సూట్ కాడని అనుకున్నాడు.

9.డాన్ శ్రీను:


గోపిచంద్ మల్లినేని ప్రభాస్ కోసం డాన్ శ్రీను స్క్రిప్ట్ రాశారు. అయితే, సినిమా కథ బుజ్జిగాడు కథకు ఈక్వల్ గా ఉందని భావించి ప్రభాస్ ఈ కథని వదులుకున్నాడు.

10. జిల్:


బాహుబలి సినిమా మొదలయిన తర్వాత ఈ సినిమా కథ ప్రభాస్‌కు వచ్చింది. కథ విన్న తరువాత ప్రభాస్ తన ఫ్రెండ్ హీరో గోపీచంద్‌కు కూడా ఇది సరిపోతుందని భావించి, తనతో సినిమా చేయమని దర్శకుడిని కోరాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా బాగా ఆడింది.