కొత్త ఏడాదిలో వెంకీమామ ప్లాన్స్ వర్క్ఔట్ అవుతాయా?

5
Venkatesh and naga chaitanya

     వెంకీ మామతో   విక్టరీ  వెంకటేష్- నాగచైతన్య కల్సి ఈ  సంక్రాంతికి చాలా ముందే పండుగను తీసుకొచ్చారు. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా, ఓపెనింగుల పరంగా ఆకట్టుకుంది.  ఈ సంక్రాంతికి ముందే వెంకీ మామతో ఆడియన్స్ ముందుకి వచ్చిన వెంకటేష్   2020  మాత్రం కెరీర్ పరంగా ఫుల్ బిజీగానే ఉన్నాడని అంటున్నారు. ఎందుకంటే  ప్రస్తుతానికి వెంకీ చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయి. ముందుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో అసురన్ రీమేక్ సెట్స్ పైకి వెళుతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు  తుదిదశకు చేరుకున్నాయి. అలాగే  త్రినాథ రావు నక్కిన… పెళ్లి చూపులు ఫేం తరుణ్ భాస్కర్ తోనూ కమిమెంట్లు ఇచ్చాడు.

    ఇవన్నీ  సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలోనే రానున్నాయి.  ఇవి కాకుండా  త్రివిక్రమ్ –వెంకటేష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆ  ఇద్దరి బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పట్లో ఆ ప్రాజెక్ట్ పట్టా లెక్కే అవకాశం లేదు. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టడానికి ఇంకా కొన్ని రోజులే  ఉంది. ఈ నేపథ్యంలో 2020 ఏడాది ఆరంభంలో అసురన్ రీమేక్ ప్రారంభమయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాగా వెంకీమామ సినిమాకు   ఈ శుక్రవారం వరకూ  వేరొక పోటీనే లేదు. నిర్మాత సురేష్ బాబు సొంత రిలీజ్ కాబట్టి థియేటర్ల విషయంలో ఇబ్బందులేమీ లేవు.

   పైగా  వెంకీమామ కు ఇప్పటివరకూ సరైన పోటీ లేకపోవడం మామ వసూళ్లకు కలిసొచ్చింది. అయితే ఈనెల 20న రూలర్- ప్రతిరోజూ పండగే-దబాంగ్ 3 చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ మూడు సినిమాల టాక్ ని బట్టి  వెంకీమామపై ప్రభావం  ఉంటుంది. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నబాలయ్యకు రూలర్ పైనే ఆశలన్నీ ఉన్నాయి. అందుకే   భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోంది.  ఇక  చిత్రలహరితో ఊరట లభించిన సాయితేజ్ ప్రతి రోజూ పండగే అంటూ థియేటర్లోకి వచ్చేస్తున్నాడు. ఈ రెండు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే వెంకీమామ పై  ప్రభావం పడుతుందని చెప్పవచ్చు. ఇక  దబంగ్ 3 వల్ల మల్టీప్లెక్సుల్లో పోటీ తప్పదు. మరి వెంకీమామ దూకుడుకి కళ్లెం పడుతుందా,రన్ రేటులో యధాస్థానం కొనసాగుతుందా అనేది చూడాలి.