More

  అది మీకు వర్తిస్తుందా .. కేసీఆర్ కి రాములమ్మ కౌంటర్ 

     కొత్తగా ఎన్నికైన మున్సిపాలిటీలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు మేయర్‌లను ఉద్దేశించి ‘పని చేయండి లేదా, పదవి నుంచి తప్పుకోండి’ అంటూ సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇవ్వడం పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ఫేస్ బుక్ ఖాతాలో స్పందించింది. ‘ఈ వార్నింగ్ కేవలం ప్రజాప్రతినిధులకు మాత్రమే వర్తిస్తుందా? లేక పని చేయని పక్షంలో సీఎం కూడా ఆ మాటకు కట్టుబడతారా?’ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆమె పేర్కొంది.  గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ కార్పొరేటర్‌లను, మేయర్‌ను ఉద్దేశించి హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ప్రగతి రిసార్ట్స్‌లో కేసీఆర్ ఇచ్చిన ప్రసంగాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు ఏదైతే వార్నింగ్ ఇచ్చారో, అప్పుడు కూడా ఇదే రకమైన ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి జనాన్ని మభ్య పెట్టేందుకు కేసీఆర్ గారడీ చేసిన విషయం హైదరాబాద్ ఓటర్లు  మర్చిపోలేదని విజయశాంతి కౌంటర్ ఇచ్చింది.

   కాగా  కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపించడం, దానికి బీజేపీ నేతల ఎదురుదాడి చేస్తున్న తీరు కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రాన్ని నిధుల విషయంలో నిలదీస్తున్న టీఆర్ఎస్ నాయకత్వం, గత ఐదేళ్ళలో సీఎం దొరవారి పాలనలో ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఏ మేరకు విడుదల చేశారు అనే విషయంపై సమాధానం చెప్పాలని రాములమ్మ డిమాండ్ చేసింది. ‘ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి కూడా  అభివృద్ధి నిధి విడుదల చేయకుండా, మొత్తం ప్రభుత్వ సొమ్మును టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దోచి పెట్టిన వైనాన్ని తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. నిధుల విషయంలో కేంద్రం చేసేది తప్పు అయితే, మీరు చేసేది ఎలా రైట్ అవుతుంది? కేంద్రానికి ఒక న్యాయం, కేసిఆర్‌కి ఒక న్యాయమా? అని తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు. తప్పనిసరిగా టీఆర్ఎస్ అధినాయకత్వం దీనికి సమాధానం చెప్పాల్సిందే’’ అని   విజయశాంతి డిమాండ్ చేసింది.

   ‘అంతేకాదు,తెలంగాణ అంతటా వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీని నెరవేర్చకపోతే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగబోమని కేసీఆర్ చెప్పారు. కానీ ఎన్నికలు అయిపోయి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు ఇంటింటికి మంచినీరు పథకం అమలైన దాఖలాలు లేవు. ఇలా  గత ఐదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలకు సంబంధించి ఆయన ఎన్నిసార్లు మాట తప్పారో దానికి ఆయన ఎన్నిసార్లు పదవి నుంచి తప్పుకోవాలో టీఆర్ఎస్ నేతలే లెక్క చెబితే బాగుంటుంది’అని రాములమ్మ ఎద్దేవా చేసింది. దీనిపై గులాబీ దళం ఎలా స్పందిస్తుందో చూడాలి.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  24 గంటల విద్యుత్ సరఫరా – కేంద్రం

  coronavirus:Central Govt announced 24 Hour Power Supply: లాక్ డౌన్ కొనసాగుతున్న సమయం లో విద్యుత్ కొరత ఉండకూడదని, 24గంటలు విద్యుత్ సరఫరా చెయ్యాలి అని కేంద్ర ఇంధన శాఖ కొన్ని కీలక...

  రూ.1125 కోట్ల భారీ విరాళం.

  కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి నిరోదించడానికి, దేశ ప్రజల ఆరోగ్యం మరియు మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడానికి అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్, విప్రోన్‌ఎస్‌ఇ, విప్రో ఎంటర్‌ప్రైజెస్ కలిసి రూ .1125 కోట్ల ఆర్ధిక సహాయం...

  తీగ లాగితే డొంక కదిలిందా … కరోనా కేసుల కలకలం

  A disturbance of corona cases in nizamuddin religious meet: విదేశాలనుంచి వచ్చిన వారి నుంచే ఎక్కువగా కరోనా వైరస్ వచ్చిందన్నది నిజం. అయితే  విదేశాల నుంచి వచ్చిన వారితో కలిసి దేశ...

  పవన్ విజ్ఞప్తికి తమిళనాడు సీఎం యాక్షన్

  Pawan Kalyan Tweet Got Response From Chief Minister: కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశమంతా   లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూలీలు ఆగిపోయారు. అయితే  ఏపీకి చెందిన మత్స్యకారులను ఆదుకోవాలంటూ జనసేన...