Saturday, January 16, 2021

Latest Posts

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. అ రధం సుమారు 40 అడుగుల ఎత్తు ఉంటుందని అంచనా. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై ఆలయ పాలక మండలి సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకోవడం వల్ల మంటలు చెలరేగిన వెంటనే ఎవరూ గుర్తించలేకపోయారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన పట్ల అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. మంటలు చెలరేగడానికి గల కారణాలేమిటనే దానిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

 ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss