ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబింకా మల్లికార్జునస్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం 8:30 గంటలకు యాగశాల ప్రవేశంతో దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి ఈ నెల 25 వరకు ఆలయంలో ఆర్జిత, హోమాలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. నవరాత్రులలో స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ నిబంధనల కారణంగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో కేఎస్ రామారావు వెల్లడించారు. కాగా ఈ రోజు ఉత్సవాల్లో పరోక్ష ఆర్జిత సేవలైన గణపతి హోమం, రుద్రహోమం, మృత్యుంజయ, చండీహోమాలు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆర్జిత సేవల్లో అభిషేకం, కుంకుమార్చన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం, స్వామి అమ్మవార్ల కల్యాణం, ఏకాంతసేవ, వేదాశీర్వచనం వంటివి పరోక్షంగా జరుగుతాయని ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు.
ఇది కూడా చదవండి: