హైదరాబాద్ లో అమెజాన్ సంస్థ భారీ పెట్టుబడి పెట్టడానికి సిద్దమయ్యింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆసియా పసిఫిక్ రీజిన్ హైదరాబాద్లో త్వరలోనే పలు డాటా సెంటర్లను నిర్వహించగలిగే భారీ ఫెసిలిటీని ఏర్పాటు చేయనుంది. ఇందుకు గాను 20,761 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టనున్నారు. 2022 నాటికి ఈ సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. దీనిపై కొంత కాలం నుంచి తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ అమెజాన్ సంస్థతో జరిపిన చర్చలు సఫలం అయినట్టు ఆయన కార్యాలయం ప్రకటించింది. కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదేనని కేటీఆర్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: