ఈ రోజు ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్ళితే ఈ ప్రమాదం నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలోని మాచవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు కూలీలు మరణించారు. ఈ కూలీలు అంత సమీపంలోని మిర్చి కొతలకు వచ్చిన వారుగా చెబుతున్నారు.అయితే పని ముగించుకుని ఇంటి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది అని,ట్రాక్టర్లో దాదాపు 30 మంది కూలీలు ఎక్కించుకుని వెల్లుతుండగా ఆ ట్రాక్టర్ ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో కరెంటు తీగలు తెగి కూలీలపై పడడంతో షాక్ తగలడం తో పలువురు అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఘటనా స్థలంలోనే 9 మంది చనిపోగా, మిగతా వారిని స్థానికులు కాపాడి ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అయితే ఆ తరువాత ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10కి చేరింది. మరో ఇద్దరిపరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు రాపర్ల సమీపంలోని మాచవరం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటన పై ఏపీ సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బంతి వ్యక్తం చేశారు .వారిని అన్ని విధాల ఆదుకుంటామని వారికి 5 లక్షలు ఆర్ధిక సహాయం చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: వలస కార్ముకులను ఆదోకోనున్న కేంద్ర ప్రభుత్వం