హైదరాబాద్: అక్రమంగా ఓ పరిశ్రమలోకి తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురంలో చోటుచేసుకుంది. గ్రామంలోని కార్తికేయ ఇండస్ట్రీస్లోకి 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. సమాచారం తెలిసిన టాస్క్ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 4 టాటా ఏస్ వాహనాలు, ఒక బొలేరో, ఒక ప్యాసింజర్ ఆటో, 8 బైక్లను సీజ్ చేశారు. బియ్యం తరలిస్తున్న 21 మందితో పాటు మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: మాస్కు లేకుండా బయటకు వచ్చిన వారికి షాక్ ఇస్తున్న పోలీసులు