Monday, April 19, 2021

Latest Posts

ఆ జైల్లో 103 మందికి కరోనా

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిని తగ్గిదమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్న దానికి అవి ఏమి పట్టకుండా విజృంభిస్తూనే ఉంది. అలాగే మహారాష్ట్రలో వందల్లో కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముంబై నగరంలో నమోదవుతున్న కేసులు గజగజ వణికిస్తున్నాయి. అధికారుల ద‌గ్గ‌ర‌నుంచి సామాన్య ప్రజానికం వ‌ర‌కు ఎవ‌రినీ వ‌ద‌ల‌ట్లేదు. దేశ ఆర్ధిక రాజధానిలో ఇలా కేసులు నమోదవుతుండటంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

తాజాగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఏకంగా 103 మందికి కరోనా సోకడం సంచలనంగా మారింది. జైలులో ఉన్న 77 మంది అండర్ ట్రయల్ ఖైదీలు, 26 మంది జైలు ఉద్యోగులకు పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింద‌ని హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ గురువారం ప్ర‌క‌టించారు. దీంతో కరోనా సోకిన ఖైదీలను, జైలు ఉద్యోగులను శుక్రవారం ఉదయం వీరంద‌రిని క్వారంటైన్‌కు త‌ర‌లించిన‌ట్లు పేర్కొన్నారు. మిగ‌తా ఖైదీల‌కు క‌రోనా సోక‌కుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏడేళ్ల కన్నా తక్కువ జైలు శిక్షపడిన సుమారు 5వేల మంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు అనిల్ దేశ్‌ముఖ్ వెల్ల‌డించారు. మిగ‌తా ఖైదీల‌కు కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని, తెలిపారు.

అయితే ఈ జైలుకు ఎదుటే కరోనా రోగులున్న కస్తుర్బా ప్రత్యేక కొవిడ్ ఆసుపత్రి ఉందని జైలులోకి నిత్యావసర సరకులను సరఫరా చేస్తున్న వారితో ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందన్న అనుమానాలను ఉన్నాయని, అలాగే జైళ్ల శాఖ ఇన్ స్పెక్టర్ వ్యక్తం చేశారు. అలాగే కొన్ని పత్రికలలో జైలులో వంట‌మ‌నిషికి క‌రోనా సోకింద‌ని, ఇత‌ని నుంచే మిగ‌తా వారికి క‌రోనా సోకిన‌ట్లు ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు అని తెలిపుతున్నాయి. ఏది ఏమైనా అంతమందికి కరోనా శోకడంతో అంతా భయబ్రాంతులకు లోనవుతున్నారు. ప్రస్తుతం అ జైల్లో 2600 ఖైదీలు ఉన్నారని వీరందరికీ కూడా కరోనా ప్రబలే అవకాశం ఉందని అందువల్ల ముందస్తు చర్యాలు చేయబడుతున్నట్లు  అధికారులు తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss