Saturday, January 16, 2021

Latest Posts

తండ్రి మీద కోపంతో కూతురుని త‌గుల‌బెట్టిన దుండ‌గులు

చెన్నై: త‌మిళ‌నాడులో దారుణం జ‌రిగింది. తండ్రి మీద కోపంతో ఇద్ద‌రు దుండ‌గులు అత‌ని 14 ఏండ్ల కూతురుపై పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టారు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ బాలిక‌ను ఆస్ప్ర‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. వెల్లుపురం ప‌ట్ట‌ణ స‌మీపంలోని సిరిమదురాయ్ గ్రామానికి చెందిన కె.జ‌య‌బాల్‌, కే కుమార్ సోద‌రుల‌కు, నిందితుడు మురుగన్‌కు మ‌ధ్య ఒక ఎక‌రం భూమి విష‌య‌మై త‌గాదా న‌డుస్తున్న‌ది.

ఈ నేప‌థ్యంలో మురుగ‌న్ స్నేహితుడు జ‌య‌బాల్ కిరాణ దుకాణానికి సిగ‌రెట్ కొనే వంక‌తో వెళ్లి దుకాణంలో ఉన్న జ‌య‌బాల్ కుమారుడు జ‌య‌రాజ్ (17)పై దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై జ‌య‌బాల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో మ‌రింత రెచ్చిపోయిన మురుగ‌న్ త‌న మ‌రో స్నేహితుడు క‌లియ‌పెరుమాల్‌తో క‌లిసి పదవ తరగతి చదువుతున్న జ‌య‌శ్రీ (14)పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. అనంత‌రం అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. కాగా ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్ద‌రినీ అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss