Tuesday, March 2, 2021

Latest Posts

ఏపీలో  హాట్ స్పాట్ – కరోనా కట్టడికి కేంద్రం ఆదేశం

11 Districts have been identified as hotspots in Telugu states

కరోనా మహమ్మారి   కంటికి కనిపించకుండా కకావికలం చేస్తోంది. మే వరకూ లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా హాట్ స్పాట్ జిల్లాలను గుర్తించిన కేంద్రంలో    తెలుగు రాష్ట్రాల్లో  రాష్ట్రంలో 11 జిల్లాలను హాట్‌స్పాట్లుగా గుర్తించినట్టు ప్రకటించింది. ఇందులో ఏపీలో 11జిల్లాలున్నాయి. తెలంగాణలో 8జిల్లాలున్నాయి.  కరోనా వ్యాప్తికి కేంద్ర బిందువుగా మారిన జిల్లాల్లో ప్రత్యక్ష కార్యాచరణ అమలుపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో  భాగంగా దేశవ్యాప్తంగా 170 జిల్లాలను హాట్‌స్పాట్లుగా గుర్తించామని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతీ సుడాన్‌ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖరాశారు.

ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదుకాని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మాత్రం సేఫ్‌జోన్‌లో ఉన్నాయి. 20కిపైగా కేసులు నమోదైన ప్రతీ జిల్లాను హాట్‌స్పాట్‌గా అందులోనూ అత్యధిక కేసులున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌ క్లస్టర్లుగా ప్రకటించారు. దేశం మొత్తమ్మీద 43 ప్రాంతాలు హాట్‌స్పాట్‌ క్లస్టర్లుగా వర్గీకరించారు. అయితే, ఏపీలో క్లస్టర్‌ ప్రస్తావన లేదు. అంటే మొత్తం 11 జిల్లాలు హాట్‌స్పాట్‌ క్లస్టర్లుగానే భావించాల్సి ఉంటుంది. క్లస్టర్‌ అంటే జిల్లాలో కేసుల సంఖ్య భారీగా ఉన్న ప్రాంతాలతో కూడిన సముదాయం. అందుకే  ఈ నెల 20 నుంచి కేంద్రం ఇచ్చిన మినహాయింపులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు మాత్రమే వర్తిస్తాయి.

కేంద్రం ప్రకటించిన హాట్‌స్పాట్‌లన్నీ రెడ్‌జోన్‌ పరిధిలోకి వచ్చేవే. ఈ జాబితాలో ఏపీ నుంచి కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలు ఉన్నాయి. హాట్‌ స్పాట్‌లపై ప్రతీవారం సమీక్ష ఉంటుందని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు కూడా ఈ పని చేయాలంటూ ప్రీతీ సుడాన్‌ వెల్లడించారు. ‘హాట్‌స్పాట్‌లపై ప్రతీ సోమవారం సమీక్ష చేయాలి. వీటి పరిధిలో లేకుండా, రెట్టింపు కేసులు నమోదయ్యే ప్రాంతాలను జాబితాలో చేర్చాలి. ఆరెంజ్‌ జోన్‌లో 14రోజుల వ్యవధిలో ఒక్క కేసు నమోదు కాకపోతే అక్కడ కంటైన్‌మెంట్‌ ముగిసినట్లే. 28 రోజుల తర్వాత కొత్త కేసులు నమోదు కాకపోతే అది పూర్తిగా గ్రీన్‌జోన్‌లోకి వెళ్లినట్లుగా భావించాలి’ అని ఆమె  రాష్ట్రాలను కోరారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss