బాగ్దాద్ మీద ఐసిస్ గ్రూప్ కు చెందిన ఉగ్రవాదులు దాడి చేయడంతో 11 మంది మరణించినట్లు అధికారులు స్పష్టం చేశారు. బాగ్దాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరలో ఉన్న రద్వానియా ప్రాంతంలోని ఓ లుక్ అవుట్ పాయింట్ మీద ఉగ్రవాదులు గ్రెనేడ్లను విసిరారు. కాగా హాషెద్ రక్షణ బృందాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. మానిటరింగ్ టవర్ మీద మొదట కాల్పులకు తెగబడటంతో 5 మంది ట్రైబల్ హాషెద్ బృందానికి చెందిన సభ్యులు మరణించారు. హాషెద్ బృందానికి సహాయం చేయడానికి వచ్చిన ఆరుగురు స్థానికులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని సెక్యూరిటీ అధికారులు తెలిపారు. ఎనిమిది మంది గాయపడిన వారిని సెంట్రల్ బాగ్దాద్ లోని ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: