Monday, January 18, 2021

Latest Posts

కల్తీ మద్యంతో 11 మంది ప్రాణాలు బలి

Illegal Liquor
కల్తీ మద్యం కొంప ముంచింది. 11 మంది ప్రాణాలను తీసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో జరిగింది. కల్తీమద్యం తాగడంతో 11 మంది మృతి చెందారు మరో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంకా ఏడుగురి పరిస్థితి మరింత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

కల్తీమద్యం ఘటన మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది. దీనితో రంగంలోకి దిగిన పోలీసు, వైద్య అధికారులు ఘటనకు గల కారణాలను అనేష్విస్తున్నారు. ప్రభుత్వం సైతం విచారణకు ఆదేశిచింది.  సమచారం అందుకున్న ఎస్పీ అనురాగ్‌ సుజనీయ సంఘటనాస్థలికి చేరుకుని మద్యం షాపు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

అయితే పోలీసుల దర్యాప్తు ప్రకారం.. మోరానా సమీపంలోని ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన వీరంతా స్వతాహాగా మద్యం తయారు చేసుకుని తాగారని, ఆ తరువాత ఒక్కొకరికీ వాంతులు, కళ్లు తిరగడం ప్రారంభమయ్యాయని తెలిపారు. వారందరినీ ఆస్పత్రికి తరలించే క్రమంలో 11 మంది మృతి చెందినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss