Sunday, June 20, 2021

Latest Posts

కరోనా నుంచి కోలుకున్న 110 సంవత్సరాల వ్యక్తి ఎలా అంటే?

110 Year Old Ramanand Teerth Recovered From Corona

110 ఏళ్ల వ్యక్తి కోవిడ్ -19 నుండి విజయవంతంగా కోలుకున్నాడు. దీనితో ఈ భయంకరమైన వైరస్ నుండి కోలుకున్న వ్యక్తులలో అత్యంత వయసు కలిగిన వ్యక్తిగా నిలిచాడు. ఈ విషయాన్ని హైదరబాద్ లోని వైద్యులు బుధవారం తెలిపారు.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, తేలికపాటి కోవిడ్ లక్షణాలు మరియు తక్కువ స్థాయి బ్రీతింగ్ సమస్యతో రామనంద తీర్థ ఏప్రిల్ 24న హైదరబాద్ లోని ప్రభుత్వం నడుపుతున్న గాంధీ ఆసుపత్రిలో చేరారు. అయితే తీర్థ ఇప్పుడు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నాడని, అతని ఆక్సిజన్ స్థాయి కూడా 97 కి పెరిగిందని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజా రావు తెలిపారు.

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, తీర్థ ఇప్పుడు కోవిడ్‌ పరీక్షల్లో నెగటివ్ వచ్చింది, కాని అతను మరికొన్ని రోజులు ఆసుపత్రి జనరల్ వార్డులో పరిశీలనలో ఉండనున్నాడు. అయితే తీర్ధ ఇంత త్వరగా కోలుకున్నాడంటే మాత్రం వైద్యులు చెప్పలేకపోతున్నారు, దీనికి కారణం ఆయన ఆసుపత్రిలో చేరినప్పుడు ఎటువంటి యాంటీ బాడీస్ లేకపోవడమే. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.

ఇకపోతే తీర్థకు కుటుంబం లేదు మరియు హైదరాబాద్ సమీపంలోని కీసర వద్ద ఒక ఆశ్రమంలో ఒంటరిగా నివసిస్తున్నారు.కొన్నేళ్ల క్రితం ప్రమాదానికి గురైన ఆయనను గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు, అక్కడ ఒక వైద్యుడు అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. గైనకాలజిస్ట్ అనుపమ వృద్ధుడికి ఆహారం, ఆశ్రయం కల్పించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss