Saturday, February 27, 2021

Latest Posts

పాక్ కవ్వింపు చర్యలకు ధీటుగా బదులిచ్చిన ఆర్మీ

15 Pakistan Army Soldiers Killed in indian Counter Assault Across The loc

ఓ పక్క ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అల్లలాడుతుంటే, మరోపక్క సరిహద్దులో పాకిస్తాన్ కవ్విస్తోంది. అయితే పాక్ కవ్వింపు చర్యలకు ధీటుగా భారత ఆర్మీ సమాధానం ఇచ్చింది. ఈ దాడుల్లో 15 పాకిస్తాన్ జవాన్లతో పాటు 8మంది ఉగ్రవాదులు హతమయ్యారని నిఘా వర్గాలు వెల్లడించారు. నిజానికి సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం గుంటనక్కలా కాచుకుని కూర్చుంటుంది. భారత్ పైకి కవ్వింపు చర్యలకు తరచూ దిగుతూనే ఉంటుందని చెప్పక్కర్లేదు. ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడి తీవ్ర అవస్థలు పడుతున్న సమయంలో కూడా పాకిస్తాన్ దుర్భిద్ధి మాత్రం మారలేదు. మరోసారి భారత సైన్యంపై కవ్వింపు చర్యలకు పాల్పడింది.

దీంతో భారత సైనికులకు చిర్రెత్తుకొచ్చి తుపాకీకి పని చెప్పారు. పాక్ బలగాల దాడులను తిప్పికొట్టారు. ఈ దాడిలో పాకిస్తాన్ కు చెందిన 15 మంది సైనికులు – 8మంది ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిజానికి కరోనా తో పాకిస్తాన్ కూడా సతమతమవుతోంది. ఈ సమయంలోనూ భారత్ పైకి ఆ దేశం కవ్వింపు చర్యలకు పాల్పడడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు దిగుతున్నారు.

ఏప్రిల్ 10వ తేదీన భారత సైన్యం ఆర్టిలరీ గన్స్ తో దాడికి దిగింది. ఈ దాడిలో పాకిస్తాన్ సైనికులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టెర్రర్ లాంచింగ్ ప్యాడ్స్తో పాటుగా.. పాక్ ఆర్మీ లాంచింగ్ ప్యాడ్స్ కూడా ధ్వంసమైనట్లు ఓ వీడియోను భారత సైన్యం విడుదల చేసింది. ఏప్రిల్ 5వ తేదీన కేరాన్ సెక్టార్ లో భారత ఆర్మీ ఐదుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. తాజాగా భారత ఆర్మీ జరిపిన దాడిలో 23మంది మృతి చెందారు. అయితే ఈ దాడి నిజమేనని పాకిస్తాన్ అంగీకరిస్తూనే కేవలం నలుగురు మాత్రమే మరణించారంటోంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss