Monday, March 8, 2021

Latest Posts

నిశ్చితార్థం జరిపి కరోనా తెచ్చుకున్నారు

హైదరాబాద్: నగరంలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. నిన్న ఓ అపార్ట్ మెంట్ లో పాతికమందికి కరోనా సోకిందన్న విషయం తీవ్ర చర్చనీయాంశంగా ఉండగానే, నేడు ఓ కుటుంబంలో 15 మందికి కరోనా నిర్ధారణ కావడం అధికార వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే ఓ పెళ్లి నిశ్చితార్థం జరిపిన పెళ్లికొడుకు కుటుంబంలో 15 మంది కరోనా బారినపడ్డట్టు గుర్తించారు. ఈ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి (58) కరోనాతో శనివారం నాడు మరణించడంతో ఈ కేసులన్నీ వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నిశ్చితార్థం మే 11న హైదరాబాదులోని ధూల్ పేట్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి లాక్ డౌన్ నిబంధనలు, భౌతికదూరం సూచనలు పక్కనబెట్టి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరైనట్టు సమాచారం. ఇప్పుడు వారందరి వివరాలు సేకరించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: సి.ఏం అనుమతీస్తే 24 గంటల్లో సర్వీసు  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss