Saturday, May 15, 2021

Latest Posts

తెల్లకార్డున్న వారందరికీ రూ.1500 ఇవ్వాల్సిందే – హైకోర్టు

మూడు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోలేదానే కారణంగా రూ.1500 ఇవ్వలేదని దాఖలైన పిటిషన్ పై హైదరాబాద్ హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోన వైరస్ కట్టడి లో భాగంగా లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో పేద ప్రజలు ఆర్ధికంగా ఇబ్బంది పడకుండా  రేషన్ సరుకులతో సహ కుటుంబానికి నెలకు రూ.1500 ఇస్తామని ప్రకటించింది. కానీ ప్రభుత్వం కనీసం నోటీసు ఇవ్వకుండా 8 లక్షల తెల్లరేషన్ కార్డులు తొలగించడంతో వారికి ప్రభుత్వం ఇస్తానన్న రూ.1500లే కాకుండా రేషన్ కూడా అందటం లేదు. దాంతో కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రోజు హైకోర్టు దానిపై స్పందించింది.

లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వారిని తక్షణం ఆదుకోవాలని, ముఖ్యంగా పేదలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని రేషన్ సరుకులతో సంబంధం లేకుండా తెల్లకార్డున్న వారందరికీ రూ.1500 ఇవ్వాలని హైదరాబాద్ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.  రూ.1500లు నిలిపివేసే ముందు లాక్ డౌన్ పరిస్థితిలో పేదల స్థితిగతులను అర్ధంచేసుకోవాలని కనీసం నోటీసు ఇవ్వకుండా 8 లక్షల కార్డులు ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించింది. అయితే తెలంగాణ అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ తెల్ల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయలేదని ధర్మాసనానికి తెలపాగా హైకోర్టు ఆయన వాదనతో ఏకీభవించ లేదు. అలాగే  8 లక్షల మందికి ఆర్థిక సాయాన్ని ఎందుకు నిలిపివేశారో పూర్తి వివరాలు కోర్టుకు సబ్మిట్ చేయాలని  ఆదేశించింది. అయితే పూర్తి నివేదిక సమర్ఫణకు కాస్త సమయం కావాలని ధర్మాసనాన్ని కోరడంతో తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

ఇది కూడా చదవండి: మోడి 20 లక్షల కోట్ల ప్యాకేజీలో మొదటి ఫలం

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss