కేవలం పది రూపాయలు రీఛార్జి చేస్తానని రెండు బ్యాంక్ అకౌంట్ ల నుంచి రూ.2 లక్షల రూపాయలు దొంగిలించిన సైబర్ దొంగలు. వినడానికి చాలా సామాన్యంగా ఉన్న ఈ సంఘటన మన చుట్టుప్రక్కలే జరిగింది. అది హైదరబాద్ లోని వనస్తలిపురం, లాక్ డౌన్ వలన ఆన్లైన్ బిల్లులు కట్టడానికి పేటిఎం ఎలా వాడాలో నేర్చుకున్న ఒక మహిళా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆన్లైన్ మోసంలో ఇరుక్కుని ఏకంగా 2 లక్షలు పోగొట్టుకుంది.
ఒక రోజు తనకి కాల్ వచ్చిందని, డిల్లీ నుంచి మాట్లాడుతున్నామని, మీ సిమ్ కార్డ్ ఎక్స్పైర్ అవ్వబోతుందని అందుకు రీచార్జ్ చేసుకోవాలని పంపిన డాక్యుమెంట్ లో ఆవిడ తన జీ-మేల్ వివరాలు, పాస్ వర్డ్ వివరాలు నింపి పంపగా అదే అదునుగా దొరికిన సమాచారంతో ఒక రోజు ఫోన్ చేసి 10 రీచార్జ్ చేసుకోవాలని మీకు మీరే రీచార్జ్ చేసుకోండి అని చెప్పగా ముందుగా ఇచ్చిన వివరాలుతో లాగిన్ అయ్యినవెంటనే ఒక లక్ష రూపాయలు వారి అకౌంట్ నుంచి కాలీ అయ్యాయి మళ్ళీ అదే విదంగా రెండవ రోజు కూడా వేరొక అక్కౌంట్ నుంచి లాగిన్ అవ్వగా మళ్ళీ ఆ అకౌంట్ లో కూడా లక్ష రూపాయలు దొంగిలించారు సైబర్ నేరగాళ్ళు.
ఇది కూడా చదవండి: