Tuesday, April 13, 2021

Latest Posts

మాస్క్ పెట్టుకోకపోతే ఇక జైలే ఎక్కడో తెలుసా!

2 Years Jail Punishment For Not Wearing Mask

వినేందుకు కాస్త కొత్తగా ఉన్నప్పటికి ఇది నిజం. మాస్కు పెట్టుకోకుండా బయటకు వెళ్లి పోలీసులకు పట్టుబడితే రెండేళ్ల వరకు జైలుశిక్ష పడే ప్రమాదం పొంచి ఉంది. అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తుంది. మాస్కు పెట్టుకోకుంటే జరిమానాలే విన్నాం కానీ.. ఈ జైలు మాటేమిటి? కొత్తగా అనుకుంటున్నారా? మాస్కుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మాస్కు పెట్టుకోకుంటే డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005 సెక్షన్ 51 నుంచి 60 ప్రకారమైతే ఏకంగా రెండేళ్ల వరకు జైలుశిక్ష పడే వీలుంది. అదే.. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేస్తే ఆర్నెల్లు జైలుశిక్ష లేదంటే వెయ్యి వరకు జరిమానా విధించే వీలుంది. కొన్ని సందర్భాల్లో రెండు శిక్షల్ని కలిపి వేసే వీలుంది.

ఇకపోతే ఏపీలో మాస్కుధరించని వారికి రూ.250 నుంచి రూ.250 చొప్పున ఫైన్ వేస్తున్నారు. అలానే దేశ రాజధాని ఢిల్లీలో మాస్కు లేని వారికి రూ.500 ఫైన్ వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss