Thursday, December 2, 2021

Latest Posts

మహేష్ బాబు కోసం కలవనున్న 20 మంది సెలబ్రిటీలు

20 Celebrities To Attend Mahesh Babu Birthday Twitter Space

ట్విట్టర్ స్పేసెస్ అనేది ట్విట్టర్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్. ఈ ఫీచర్ తో 100 మంది కి పైగా ఒకేసారి మీటింగ్ లో పాల్గొనవచ్చు. ఈ ఫీచర్ ని సెలబ్రిటీలు కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు, మహేష్ బాబు టీమ్ ఈ ఫీచర్‌ తో కొత్త రికార్డులు నెలకొల్పాలని యోచిస్తుంది. ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్‌గా 7.02 PM కి ప్రత్యేక ట్విట్టర్ స్పేస్ సెషన్ ప్లాన్ చేసింది మహేష్ బాబు టీం.

ఈ స్పేస్ సెషన్ లో 20 మంది సెలబ్రిటీలు హాజరు కానున్నారు. ఈ సెషన్ కోసం మహేష్ బాబుతో కలిసి నటించిన వారు మరియు చాలా మంది సినీ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. వీరంతా ఈ సెషన్ లో మహేష్ తో వారికున్న అనుబంధం మరియు మహేష్ పై వారికున్న అభిప్రాయాలను తెల్పనున్నారు. టాలీవుడ్‌లో ఎన్నడూ చూడని ఈ సెషన్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss