Sunday, January 17, 2021

Latest Posts

ఘోర రోడ్డు ప్రమాదం… 23 మంది మృతి

లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు ఎటువంటి కష్టాలు పడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం, కానీ ప్రకృతి ఇంత కఠినంగా ఉంటుందని ఊహించం, వలస కూలీలు ప్రయాణిస్తున్న ఒక ట్రక్ ప్రమాదానికి గురి అయ్యింది, కాగా వేరొక ట్రక్ వచ్చి వలస కూలీలు ప్రయాణిస్తున్న ట్రక్ ను ఢీకొంది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఔరాయా జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది అక్కడికక్కడే మృత్యు వాటా పట్టగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

కాగా వీరందరూ వలస కూలీలు కావడంతో లాక్ డౌన్ నియమాలు సరలించిన నేపధ్యంలో ఎవరి సొంత ఉళ్లకు చేరేందుకు పయనమవుతుండగా ఈ సంఘటన జరగడం అత్యంత బాధాకరం. వలస కులీలందరు రాజస్తాన్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తుండగా శనివారం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఇది కూడా చదవండి: విశాఖ నావీ అధికారుల హనీ ట్రాప్ సూత్రదారి అరెస్టు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss