Tuesday, March 2, 2021

Latest Posts

బర్త్ డే వేడుక వల్ల అపార్ట్మెంట్ లో 23 మందికి కరోనా

హైదరాబాద్ లో  రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. భౌతిక దూరం పాటించడంతో పాటుగా, మాస్క్, శానిటైజర్లు వాడాలని ప్రభుత్వం ఎంతచెప్పిన కొంతమందికి తలకి ఎక్కించుకోకుండా సామూహిక సమావేశాలు, పార్టీలు చేసుకుంటున్నారు. ఫలితంగా కరోనా బారిన పడుతున్నారు.  ఇలాంటిదే హైదరాబాద్ లోని సంతోష్ నగర్లోని మాదన్నపేటలో ఓ అపార్ట్మెంట్ లో చోటుచేసుకుంది.

ఓ అపార్ట్మెంట్ నివసించే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అక్కడి వారందని పిలిచి తన బర్త్ డే వేడుకలను ఇంట్లో ఘనంగా నిర్వహించాడు. ఆ బర్త్ డే వేడుకలకు కరోనా వచ్చిన వారు కూడా హాజరు కావడంతో వారితో పాటు మరి కొంతమందికి సోకింది. అపార్ట్మెంట్ లో వాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించగా, 23 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.  దీంతో వీరందరిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందచేస్తున్నారు. ఒకే అపార్ట్మెంట్ లో 23 మందికి కరోనా పాజిటివ్ రావడంతో అ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది.

ఇది కూడా చదవండి: ఉలిక్కిపడిన శ్రీకాకుళం : ఒక్క రోజులోనే 21 మందికి కరోనా

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss