Friday, March 5, 2021

Latest Posts

కేరళలో జరిగిన మరో పరువు హత్య

27 Year Old Man Murdered In Kerala

పరువు హత్య ఈ సారి కేరళలో కలకలం రేపింది. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. తమకు ఇష్టం లేకుండా తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో 27 ఏళ్ల వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని  తెన్కురిస్సి ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే 27 ఏళ్ల అనీష్‌ అనే వ్యక్తి ఒక యువతిని ప్రేమించాడు. అయితే యువతి తండ్రి ప్రభుకుమార్‌ ఆ ప్రాంతంలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా పేరు సంపాదించాడు. దీనితో తన కూతురును ప్రేమించడానికి వీలేదని అనీష్‌ను చాలాసార్లు హెచ్చరించాడు. అయితే యువతి కూడా అనీష్‌ను ఇష్టపడడంతో మూడు నెలల క్రితం వారిద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

అయితే అనీష్‌ పెళ్లి ఇరు కుటుంబాల మధ్య గొడవలకు దారి తీసింది. దీంతో అనీష్‌ దంపతులు పోలీసులను ఆశ్రయించగా వారు జోక్యం చేసుకొని కుటుంబాల మధ్య రాజీ కుదిర్చారు. అయితే యువతి కుటుంబసభ్యులు రాజీకి అంగీకరించినా అనీష్‌ దంపతులను మాత్రం చంపుతామని బెదిరించేవారు. అప్పటినుంచి అనీష్‌ దంపతులు ఇరు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు.

కాగా శుక్రవారం సాయంత్రం  అనీష్ ఆఫీస్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా యువతి తండ్రి ప్రభు కుమార్‌, ఆమె మేనమామ సురేష్ లు అతని పై దాడి చేసి హత్య చేశారు. అయితే రక్తపు మడుగులో పడి ఉన్న అనీష్‌ను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఆసుపత్రికి చేరేలోగానే అనీష్‌ ప్రాణాలు విడిచాడు. అయితే అనీష్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె తండ్రి ప్రభు కుమార్‌, మేనమామ సురేశ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss