Sunday, June 20, 2021

Latest Posts

2 డీజీ మందు ఎలా పని చేస్తుందంటే

2dg medicine details all you need to know:

2 డియాక్సీ డి క్లూకోజ్.. షార్ట్‌గా చెప్పాలంటే 2 డీజీ.. ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న మందు. కరోనా నియంత్రణకు ఈ మందు చాలా ఉపయోగపడుతుందంటూ పెద్ద చర్చే నడుస్తోంది. తాజాగా ఈ మందును కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం.. త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండటం తెలిసిన సంగతే. ఈ మందు గురించి జనాలు ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు. వివిధ మార్గాల్లో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మందు గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి.

2 డీజీ మందును మొదట రేడియేషన్ ప్రొటెక్షన్ ఏజెంట్‌గా అభివృద్ధి చేశారు. క్యాన్సర్ రోగులకు ఇచ్చే రేడియేషన్ వల్ల కలిగే దుష్పరిమాణాలను నివారించడానికి 30 నిమిషాల ముందు దీన్ని ఇస్తారు. ఈ మందుకు వైరస్‌ను కట్టడి చేసే గుణం ఉందని పరిశోధనల్లో కనుక్కున్నారు. ఈ 2 డీజీ.. వైరస్‌కు కావాల్సిన గ్లూకోజ్‌ను అందకుండా చేసి దాని పునరుత్పత్తిని నివారించడం ద్వారా వైరస్‌ను కట్టడి చేస్తుందని పరిశోధనలో తేలింది. కాబట్టి దీనికి యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ గుణాలు ఉన్నట్లు ఒక నిర్ధారణకు వచ్చారు.

కరోనా నియంత్రణకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మొత్తం మూడు దశలలో కలిపి 330 మంది రోగుల మీద పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో 2 డీజీ ఒక మోస్తరు నుంచి ఎక్కువ తీవ్రత ఉన్న రోగులు ఆక్సిజన్ మీద ఆధారపడటం తగ్గించి త్వరగా ఉపశమనం కలుగజేస్తుందని తేలింది.

అయితే వ్యాధి తీవ్రత ఒక మోస్తరు నుంచి అతి తీవ్రంగా ఉండి,ఆక్సిజన్ స్థాయి 94 కన్నా తక్కువ ఉండి ఇంకా ఐసీయూ అవసరం పడని రోగులకు ఈ మందును ఇవ్వమని చెబుతున్నారు. 2డీజీ మందును 45 గ్రాముల పరిమాణంలో ఒక గ్లాస్ నీటిలో కలుపుకుని రోజుకి 2 సార్లు 10 రోజులపాటు ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ప్రస్తుతం 5000 ప్యాకెట్లు తయారు చేసి రక్షణ దళానికి ఇచ్చారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ మొదటి వారానికల్లా బహిరంగ మార్కెట్ లో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss