జమ్మూకశ్మీరులోని కుల్గాం జిల్లా చింగం ప్రాంతంలో శనివారం ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూకశ్మీరు పోలీసులు చెప్పారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపగా, జవాన్లు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మరణించారని కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదుల కోసం భద్రతాదళాల గాలింపు కొనసాగుతోంది. వరుస ఎన్కౌంటర్లతో జమ్మూకశ్మీరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అయితే ఆర్మీ అధికారులు ఎవరు అయినా గాయపడ్డారా అనే దాని మీద ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టగా ఉగ్రవాదులు తారస పడి కాల్పులకు దిగారు. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: