ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకి శ్రీకారం చుట్టి మూడేళ్లు అవుతుండటం తో పార్టీకి విజయం కోసం కీలక పాత్ర పోషించిన పాదయాత్రకు మూడేళ్లు పూర్తవడంతో వైసీపీ అధ్వర్యంలో ప్రజా చైతన్య కార్యక్రమాలను పండుగలా నిర్వహించాలి అని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. అలాగే ఈరోజు నుంచి పది రోజుల పాటు ప్రజలతో కలిసి అయి ప్రభుత్వ పథకాల గురించి వివరించనున్నారు. 2017 నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్రని ప్రారంభించారు జగన్. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకూ మొత్తం13 జిల్లాలను టచ్ చేస్తూ సాగింది పాదయాత్ర. 134 నియోజవర్గాల్లో 341 రోజుల పాటు 3వేల648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 2వేల516 గ్రామాల్లో జగన్ పాదయాత్ర సాగింది. మొత్తం 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమవేశాలతో పాదయాత్ర చేశారు జగన్. సీఎం వైఎస్ జగన్ ఓకే జాబితా లో 175 మంది అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్ధులను, 25 మంది ఎంపీ అభ్యర్ధులను ప్రకటించడం చూశామని, ఇది కూడా ఒక చరిత్ర అంటూ కొనియాడారు. అయితే మొదటి 14 నెలలు జనంలో ఉంది, 17 నెలలుగా జనం కోసం ప్రభుత్వం ను నడుపుతూ ప్రజల కోసమే అంకితం అవుతూ పాలన కొనసాగిస్తున్నారు అని తెలిపారు.
ఇది కూడా చదవండి: