Tuesday, January 25, 2022

Latest Posts

కోతులపై పైశాచికత్వం

38 monkeys poisoned

మూగజీవాలను అత్యంత దారుణంగా హింసించి చంపిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉన్న చౌడనహళ్లి గ్రామంలో జరిగిన ఘటన మానవత్వానికి మాయనిమచ్చగా మారింది. చౌడనహళ్లి గ్రామంలోనికి వెళ్లే రోడ్డు మీద పెద్ద పెద్ద గోనె సంచులు రక్తంతో ఉండటంతో ఆ రహదారి గుండా వెళ్ళే ఓ వ్యక్తి అనుమానం వచ్చి ఆ గోనె సంచులను తెరిచి చూడగా ఆ గోనె సంచిలో కోతులు ఉన్నాయి.  అందులో కొన్ని చనిపోయి ఉండగా మరి కొన్ని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. మిగిలిన సంచులను చూడగా వాటిలో కూడా అలాగే ఉన్నాయి. వాటిలో కొన ఊపిరితో కొట్టుకుంటున్నకోతులను గ్రామస్తులు నీళ్లు తీసుకొచ్చి వాటికి తాగించారు. ఈ విషయాన్ని అటవీ శాఖ సిబ్బందికి  తెలియజేశారు.

ఇది పక్క ప్లాన్ ప్రకారం జరిగిందని అటవీ శాఖ సిబ్బంది తేల్చారు. మొత్తం 38 కోతులు చనిపోగా వాటికి పోస్ట్ మార్టం నిర్వహించగా అందులో కోతులకు విషం పెట్టినట్టు వెల్లడైంది.  వాటికి ఆహారంలో విషం పెట్టి ఆ తర్వాత వాటిని గోనె సంచుల్లో వేసి కట్టేసి దారుణంగా కొట్టిన తర్వాత ఆ బ్యాగులను తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారని అటవీ శాఖ సిబ్బంది బావిస్తున్నారు. ఈ ఘటనలో 38 కోతులు ప్రాణాలు కోల్పోగా మరో 20కి పైగా కోతులు గాయపడ్డాయి. గాయపడ్డ వాటికి అటవీ శాఖ సిబ్బంది చికిత్స అందిస్తున్నరు.ఈ దారుణానికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసినాట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss