39 Sanitation Workers having Coronation Positive in delhi
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే 39 మంది పారిశుద్ధ్య కార్మికులకు కరోనా పాజిటివ్‌గా రావడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో ప్రభుత్వం, అధికారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పాజిటివ్‌గా తేలిన వారందరికీ పరీక్షలు నిర్వహించి క్వారెంటైన్‌కు తరలించారు. అయితే వారు ఎవరిని కలిశారో అనేది అధికారులు వెదికే పనిలో ఉన్నారు. త్వరితగతిన వారిని గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారిందరూ ప్లాస్మా చికిత్సకు స్పందిస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2376 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వగ మరణించిన వారి సంఖ్య 50కి చేరింది.