స్వీయ నిర్భర భారత్ ప్యాకేజీలోని మూడవ ఆర్ధిక ప్యాకేజీను నిర్మలా సీతారామన్ తెలియాయచేసారు. ఈ సారి వ్యవసాయం దాని అనుబంద రంగాలపై దృష్ట్రి పెట్టారు. కాగా మొదటి ప్యాకేజీలో ఎంఎస్ఎంఈ కోసం ప్యాకేజ్ తయారు చేయగా, రెండ ప్యాకేజీను చిన్న తరహా పరిశ్రమలు, వలస కూలీలు, వ్యవసాయ కూలీలు కోసం తయారు చేశారు. తాజాగా ఈ రోజు ప్రకటించిన ప్యాకేజ్ పూర్తిగా వ్యవసాయ రంగానికి పూర్తి ఆర్ధిక దైర్యం ఇచ్చేలా ఉంది.
కాగా ఈ ప్యాకేజీలో మత్స్య, డైరీ పరిశ్రమలు, ఫుడ్ ప్రొసెసింగ్ కోసం 11 అంశాలలో రాయితీలు ప్రకటించడం జరిగింది. భారతదేశం వ్యయసాయ ఆధారిత దేశం, దేశంలో 85 శాతం వ్యవసాయ కమతాలు చిన్న,సన్న కారు రైతులవే. ఇప్పటికే ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో స్వయం సంవృద్ది సాదించినది భారతదేశం. కనుక పూర్తి వ్యవసాయ మరియు అనుబంధ ఆదారిత పరిశ్రమలకు ఈ ప్యాకేజీను కేటాయించినట్టు భారత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతా రామన్ తెలియ చేశారు.
ఇది కూడా చదవండి: మండిపోతున్న చికెన్ ధరలు… అప్పుడు వద్దని ఇప్పుడు ఎగబడుతున్నారు..