4 Lakh Poultry Birds Died Due To Bird Flu
ప్రస్తుతం దేశంలో ఇప్పటికే కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ కారణంగా పక్షులు మృత్యువాత పడుతున్నాయి. కేరళ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ తో బాతులు, పక్షులు కూడా మృతి చెందాయి.
అయితే హర్యానాలో గత పది రోజుల్లోనే 4 లక్షలకు పైగా పౌల్ట్రీ కోళ్లు చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఒక్క పంచకుల జిల్లాలోనే ఇన్ని కోళ్లు మరణించాయి. ఇంకా మధ్యప్రదేశ్ లో కూడా బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
మధ్యప్రదేశ్ లో మంద్సౌర్ జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు చికెన్ సెంటర్లు ముసివేయడమే కాక, కోడిగుడ్ల విక్రయాలను నిషేధించారు. మంద్సౌర్ ప్రాంతంలో ఒకే రోజు 100 కాకులు చనిపోవడమే కాక.. ఇక ఇండోర్ ప్రాంతంలో చనిపోయిన కాకుల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌ని గుర్తించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ మాట్లాడుతూ ఇండోర్‌లో చనిపోయిన కాకుల్లో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) గుర్తించినట్టు పేర్కొన్నారు.
అంతే కాదు హిమాచల్ ప్రదేశ్‌లోని ప్యాండ్ డ్యామ్ చట్టుపక్కల పెద్ద మొత్తంలో బాతులు మరణించాయి. వైరస్‌తోనే అవి మృతిచెందినట్లు పరీక్షల్లో తేలింది. అప్రమత్తమైన కంగ్రా జిల్లా యంత్రాంగం.. ఫతేపూర్, దెహ్రా, జవాలి, ఇందోరా ప్రాంతాల్లో చికెన్, గుడ్లు, చేపల అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధించారు.
ఇవి కూడా చదవండి: