Thursday, December 2, 2021

Latest Posts

ఎన్.ఆర్.ఐ లను పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్ళిపోయిన 5 గురు టాలీవుడ్ హీరోయిన్లు

5 Tollywood Heroines Who Settled In Foreign

మన టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు బిజినెస్ మాన్ లని పెళ్లి చేసుకొని ఇండస్ట్రిని వదిలేసి సెట్టిల్ అయ్యారు. అయితే కొంత మంది మాత్రం ఎన్.ఆర్.ఐ లను పెళ్లి చేసుకొని ఫారిన్ లో సెట్టిల్ అయ్యారు. అలా ఎన్నారై లని పెళ్లి చేసుకుని ఫారిన్ లో సెట్టిల్ అయిన 5 గురు హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

5 Tollywood Heroines Who Settled In Foreign:

1. లయ: 

laya familyh

లయ తెలుగులో 30 కి పైగా సినిమాల్లో కనిపించారు. లయ ఎన్నారై అయిన శ్రీ గణేష్ ని 2006లో పెళ్లి చేసుకున్నారు. శ్రీ గణేష్ ఒక డాక్టర్ కాగా ప్రస్తుతం వీరు కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

2. మీరా జాస్మిన్: 

meera jasmine

మీరా జాస్మిన్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించింది. ఆమెకు భద్ర సినిమా మంచి విజయాన్ని సాధించి పెట్టింది. ఈమె పవన్ సరసన గుడుంబా శంకర్ సినిమాలో నటించింది. అయితే ఈమె 2014 లో అమెరికన్ అయిన అనిల్ జాన్ టైటస్ ని పెళ్లి చేసుకుని ఫారిన్ లో సెటిల్ అయ్యింది.

3. రంభ: 

rambha

హీరోయిన్ రంభ చిరంజీవి సరసన బావ గారు బాగున్నారా సినిమాలో చేసింది ఇది ఆమె కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈమె కూడా ఎన్.ఆర్.ఐ లను పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది. రంభ కెనడాకు చెందిన ఇంద్రన్ ని 2010 లో పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహానికి కానుకగా ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు ఉన్నారు.

4. మాధవి: 

Madhavi

సీనియర్ హీరోయిన్ మాధవి బిజినెస్ మ్యాన్ అయిన రాల్ఫ్ శర్మని వివాహం చేసుకుంది. అయితే రాల్ఫ్ శర్మ తండ్రి జర్మనీకి చెందిన వారు తండ్రి భారత దేశానికి చెందిన వారు కావడం విశేషం. ప్రస్తుతం ఈమె న్యూజెర్సీలో నివసిస్తుంది, వీరికి ముగ్గురు అమ్మాయిలు. మాధవి మెగాస్టార్ చిరంజీవి ఖైదీ చిత్రంలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈమె తెలుగు చిత్రాలే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ సినిమాల్లో కూడా నటించారు.

5. గోపిక:

gopika familyనా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకున్న గోపిక ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివసిస్తుంది. ఈమె అజిలేష్ చాకో ని పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్ అయ్యింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.

ఇది కూడా చదవండి:   

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss