Tuesday, March 2, 2021

Latest Posts

మీడియాను వదలని కరోనా

 50 journalists test corona positive in Tamil nadu

కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ఆయా దేశాల్లో ప్రధానులు రాణులు,అధికారులు,వైద్యులు,పోలీసులు ఇలా ఏ దేశంలో చూసినా కరోనా విఆలయతాండవం చేస్తూ కమ్మేస్తోంది. ఇక  ఇప్పుడు మీడియాను తాకేసింది. మొన్న ముంబైలో ,నిన్న చెన్నైలో జర్నలిస్టులకు కూడా కరోనా సోకింది. అందుకే టెస్టులు చేస్తున్నారు.

   ఈ ఘటనపై కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందిస్తూ   ముంబై నగరంలో 50 మంది జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో తగు  జాగ్రత్తలు తీసుకోవాలని జర్నలిస్టులకు సలహా ఇచ్చారు. దేశంలో వార్తాపత్రికలు, టీవీల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు కరోనా సోకకుండా తగిన ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రమంత్రి సూచించారు.

‘‘ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న 50 మంది జర్నలిస్టులు, ముఖ్యంగా కెమెరామెన్ లు ముంబైలో కోవిడ్ -19 పాజిటివ్‌గా గుర్తించడం ఆశ్చర్యకరం. విధినిర్వహణలో ప్రతీ జర్నలిస్ట్ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి’’అని కేంద్రమంత్రి జవదేకర్  ట్విట్టర్‌లో పోస్ట్‌లో కోరారు. వార్తాపత్రికలు, మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss