Thursday, December 2, 2021

Latest Posts

దళిత బంధు పథకం కోసం 500 కోట్లు విడుదల

500 Crores Released For Dalit Bandhu Scheme

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన తెలంగాణ దళిత బంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలో మొదలు పెట్టనున్నట్లు తెలిపింది. తాజాగా ఈ పథకం అమలు చేయడానికి రూ.500 కోట్లను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. సోమవారం కెసిఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని అమలు చేయడానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు రూ.500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దళిత బంధు పథకం రాష్ట్రంలో దళితుల సాధికారత మరియు ఉద్ధరణకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆలోచన. ఈ పథకం కింద అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అండనుంది. తాజాగా విడుదలైన రూ.500 కోట్లు హుజూరాబాద్ నియోజకవర్గంలోని 5000 కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాలు ఉన్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss