Sunday, January 24, 2021

Latest Posts

ఏపీలో స్కూల్స్‌లో కరోనా కలవరం

కోవిడ్ కారణంగా కొన్ని నెలలుగా మూతపడిన స్కూల్స్ రెండు రోజుల క్రితం తెరుచుకున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్కూల్స్ రన్ అవుతున్నాయి. అయితే స్కూళ్లు ఇలా తెరుచుకున్నాయో లేదో కరోనా కేసులు బయటపడుతున్నాయి.స్కూల్స్ తెరుచుకోవడంతో విద్యార్థులు, టీచర్లు బడి బాట పట్టారు. తల్లిదండ్రుల అంగీకార పత్రంతో విద్యార్థులు బడికి వస్తున్నారు. రెండో రోజున ఏపీలో 99.92 శాతం మేర తెరుచుకున్నాయి. మొత్తంగా 33శాతం మేర విద్యార్థులు, 90 శాతం మేర టీచర్లు విధులకు హాజరు అయ్యారు. కృష్ణా జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ వంద శాతం మేర పాఠశాలలు తెరుచుకున్నాయి. గత రెండు రోజులతో పోలిస్తే మూడో రోజు విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అయితే ఇదే సమయంలో కోవిడ్ వైరస్ విజృంభణ మాత్రం ఆగడం లేదు. ఏపీలోని కొన్ని జిల్లాల ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా టెన్షన్ పెడుతోంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. దాంతో తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపాలంటే భయపడిపోతున్నారు.

చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభింస్తుంది. రెండు రోజుల క్రితం స్కూళ్లు తెరవడంతో కరోనా టీచర్లు, విద్యార్థులకు వ్యాపిస్తుంది. గడిచిన 2రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 150 మంది టీచర్లకు కరోనా నిర్ధారణ అయింది. దాంతో కోవిడ్ పరీక్షల కోసం ఉపాధ్యాయులు క్యూ కడుతున్నారు. ఈ నెల 8లోపు పరీక్షలు చేయించుకోవాలని జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు నెల్లూరు జిల్లాలో ముగ్గురు విద్యార్థులు, ఓ టీచరుకు కర్నూలు జిల్లాలో ఓ టీచర్‌కు కోవిడ్ సోకింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss