7 Non Veg Items You Think Might Veg Items, Non Veg Items, Non Veg Items You Think Might Veg Items, Veg Items, Veg Items Non Veg Items, Non Veg Items, Veg vs Non Veg, 7 Food Items, 7 food items you think veg items

7 Non Veg Items Think Veg Items

ప్రతీ ఒక్కరూ కష్టపడేది ఫుడ్ కోసమే. అయితే ఇందులో రెండు రకాల ఫుడ్స్ ఉన్నాయి. ఒకటి వెజ్ కాగా, రెండోది నాన్ వెజ్. ఫుడ్ అంటే ఇష్టపడే వారు చాలు మంది ఉన్నారు. చాలా మంది రోజూ ఏదో ఒకటి స్పెషల్ గా తినాలని చాలా వెరైటీ లు తింటూ ఉంటారు. అయితే చాలా మంది తెలియక వెజ్ అనుకోని నాన్ వెజ్ తింటూ ఉంటారు.

ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు వెజ్ అనుకోని నాన్ వెజ్ తింటున్న వాటి గురించి చూద్దాం:

1. సలాడ్: 

Saladసలాడ్ అంటే అందరూ వేజిటబుల్స్ తో చేస్తారు కదా అనుకుంటారు. అయితే ఇందులో కూడా కొన్ని రెస్టారెంట్లలో ఎగ్ తో డెకరేట్ చేస్తారు. సో మీరు వెజిటేరియన్ అయితే ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఇది చెబితే సరిపోతుంది.

2.నాన్: 

Naan

మనలో రోజు చాలా మంది చపాతీలు తింటూ ఉంటారు. అయితే రోజు చపాతీ కాకుండా కొంత మంది నాన్ లు ఆర్డర్ పెట్టుకుంటారు. అయితే నాన్ వెజ్ కదా అని మీరు అనుకోవచ్చు. కానీ కొంత మంది నాన్ లను ప్రిపేర్ చేసేటపుడు పిండిలో ఎగ్ ను కలుపుతారు. నాన్ సాఫ్ట్ గా రావాలని ఇలా చేస్తారు. అయితే ఇది తెలియక చాలా మంది నాన్ వెజ్ అనుకోని తింటూ ఉంటారు.

3.బీర్: 

Beer

వీకెండ్ వచ్చిందంటే చాలా మంది అబ్బాయిలు బీర్ తాగడానికే సిట్టింగ్ వేస్తూ ఉంటారు. కానీ బీర్ తయారు చేసేటపుడు ఇందులో ఇసింగ్లాస్ అనే పదార్ధం వాడతారు. బీర్ గోల్డెన్ కలర్ లో కనిపించడం కోసం దీనిని ఉపయోగిస్తారు. ఫిష్ బ్లాడర్ నే ఇసింగ్లాస్ అని పిలుస్తారు. వైన్ తయారీ లో కూడా దీనిని ఉపయోగిస్తారు.

4.ఆయిల్: 

Oil

ఆయిల్ లేకుండా ఏ వంటకం తయారవ్వదు. దాదాపు అన్ని ఆయిల్ కంపెనీ లు తమ ఆయిల్ హార్ట్-ఫ్రెండ్లీ అంటూ యాడ్ లు ఇస్తూ ఉంటారు. ఒమేగా-3 ఆసిడ్స్ ఉన్న ఆయిల్స్ ను ఫిష్ ఆయిల్స్ నుంచి తయారు చేస్తారు. అలాగే.. కొన్ని ఆయిల్స్ తయారీ లో లానోలిన్ నుంచి తీయబడిన డి విటమిన్ ని కలుపుతారు. ఈ లానోలిన్ అనే పదార్ధం గొర్రెల నుంచి వస్తుంది.

5.పంచదార: 

Sugar

పంచదార లేకుండా మనకి పొద్దున్నే కాఫీ తాగాలని అనిపించదు. ఈ షుగర్ క్లియర్ గా, వైట్ క్రిస్టల్స్ లాగ ఉంటుంది కదా. నాచురల్ గా తయారు చేయబడ్డ షుగర్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. క్లీనింగ్ ప్రాసెస్ తరువాత ఇది వైట్ గా అవుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ ప్రాసెస్ లో నాచురల్ కార్బన్ ని వినియోగిస్తారు. ఈ నాచురల్ కార్బన్ ఎక్కడనుంచి వస్తుందో తెలుసా? అనిమల్ బోన్స్ నుంచి ఈ నాచురల్ కార్బన్ ను సేకరించి షుగర్ తయారీ లో వాడతారు.

6. చీజ్:

Cheese

చీజ్ లేకుండా మనకి చాలా ఫాస్ట్ ఫుడ్స్ ఉండవు. చీజ్ ని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి..? కానీ ఇందులో ఏమి నాన్ వెజ్ ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? ఇందులో “రెనెట్స్” అనే పదార్ధం ఉంటుంది. ఇది జంతువుల చిన్న ప్రేవుల నుంచి తయారయ్యే ఒక ఎంజైమ్. చీజ్ పాకెట్స్ పై కూడా ఇది మెన్షన్ చేయరు. కాబట్టి ఇది చాలా మందికి తెలిసే అవకాశం లేదు.

7. చూయింగ్ గమ్: 

chewing gum

వీటిని ఊరికే టైం పాస్ గా తింటూ ఉంటాము. ఇందులో చూయింగ్ గమ్ ను మనం నమిలి పారేయడమే తప్ప తినలేము. ఈ చూయింగ్ గం లో జెలటిన్ ఉంటుంది. సాగే లక్షణం కోసం దీనిని వినియోగిస్తారు. జెలటిన్ చర్మం, లిగమెంట్స్, ఎముకలు మరియు ఆవులు మరియు పందుల లిగమెంట్స్ నుండి తీసుకోబడింది.

ఇది కూడా చదవండి: