Thursday, January 21, 2021

Latest Posts

లాక్ డౌన్లో రోడ్డుపై తిరుగుతున్న 7 గురుకి క్వారంటైన్

అమలాపురంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై సంచరిస్తున్న 7 గురుని క్వారంటైన్ కు తరలించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా లాక్ డౌన్ అమలులో వున్న నేపధ్యంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి బి.హెచ్. భవానీ శంకర్ హెచ్చరించారు. గురువారం అమలాపురం నల్లవంతెన వద్ద లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఉదయం 10.30 గంటల తరువాత ఏడుగురు వ్యక్తులు రోడ్డుపై సంచరిస్తుండటంతో ఆర్డీఓ ఆ ఏడుగురిని భట్ల పాలెం బి.వి.సి. ఇంజనీరింగ్ కళాశాలలోని క్వారంటైన్ సెంటర్ కు తరలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు కొనుగోలుకు అనుమతి ఇచ్చామని అనంతరం ప్రజలు, వ్యాపారులు చేరుకునేందుకు అరగంట సమయం గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగిందన్నారు. అయితే దీనిని ఆసరాగా తీసుకుని ఎవరైనా రోడ్ల పై సంచరిస్తే లాఠీ ఛార్జ్ చేయడంతో బాటు వారిని క్వారంటైన్ సెంటర్ కు తరలించడం జరుగుతుందని హెచ్చరించారు

ఇది కూడా చదవండి: విద్యుత్ బిల్లులపై వై.ఎస్ జగన్ కీలక నిర్ణయం

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss