70 cows infected with leptospirosis disease
ఒక వైపు కరోన వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కొండపల్లి గ్రామానికి చెందిన 70 ఆవులు శరీరంపై ఎర్రటి మచ్చలు, కళ్లనిండా రక్తం వస్తుండటంతో అక్కడి ప్రజలు మరింత భయాందోళనకు గురి అయ్యారు. బుధవారం నాడు అస్వస్థత గురి అయిన ఆవులను చూసిన ప్రజలు కొండపల్లి హక్కుల పోరాట సమితీ కన్వీనర్ చెరుకుమల్లి సురేష్‌కు తెలుపగ అతడు వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు. దాంతో అక్కడికి చేరుకున్న వెటర్నరీ వైద్యులు గోవులను పరీక్షించి వాటికి పొంగు జబ్బు వచ్చిందని నిర్థారించారు. అలాగే పొంగు అనేది అంటు వ్యాధి అని, ఇది ఒక ఆవు నుంచి మరో ఆవుకు వ్యాపిస్తుందని వైద్యులు తెలిపారు. అంతే కాకుండా ఈ వ్యాధి శరీరం నుంచి కడుపులోకి పాకి ఉంటే ప్రమాదమని కూడా చెప్పారు.
వ్యాధి సోకిన 70గోవులకు వారం రోజుల పాటు చికిత్స అందించాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. అలాగే రోడ్లపై తిరిగే ఇతర ఆవుల పట్ల యజమానులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. కాగా గోవులకు కరోనా సోకదని డాక్టర్లు స్థానికులకు తేల్చి చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.