Monday, July 26, 2021

Latest Posts

తెలంగాణలో రోజుకు సగటున 749 మంది మృతి

749 People Dying In Telangana Everyday

గత రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ ఏడాది మేలో 23,242 మంది మరణించారు. గణాంకాల ప్రకారం, ప్రతి రోజు సగటున 749 మంది మరణిస్తున్నారని ఇది సూచిస్తుంది. మరణాల సంఖ్య 2019 లో 1,22,102 నుండి 2020 లో 1,54,992 కు పెరిగింది. మరోవైపు, మే 2021 నాటికి 76,024 మరణాలు తెలంగాణలో నమోదయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, మునిసిపాలిటీలు మరియు గ్రామాల్లో డెత్ సెర్టిఫికెట్స్ కోసం నమోదు చేయబడిన వివరాలను పరిశీలించిన తరువాత మరణాల సంఖ్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం మే నెలలో జిహెచ్‌ఎంసిలో 10,858 డెత్ సెర్టిఫికెట్స్ జారీ చేయబడ్డాయి. ఇది రోజుకు సగటున 350 మరణాలను సూచిస్తుంది. గత ఏడాది జూన్ నుంచి మృతుల సంఖ్య రాష్ట్రంలో పెరిగింది.

ఈ వివరాలను పరిశీలిస్తే ప్రభుత్వం చాలా వరకు నిజాలను దాచి పెడుతుందని అర్ధమవుతుంది. తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం రోజుకు సగటున కేవలం 1500 కేసులు మాత్రమే వస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఇలా వస్తే రోజుకు సగటున 749 మంది ఎలా చనిపోతున్నారనేది మనం ఆలోచించాల్సిన విషయం.

ఇవి కూడా చదవండి:

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss