Thursday, December 2, 2021

Latest Posts

తెలుగు రాష్ట్రాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

75th independence day celebrations in Telugu States

తెలుగు రాష్ట్రాలలో 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేశ విముక్తి కోసం తృణ ప్రాయంగా తమ ప్రాణాలను త్యాగం చేసిన మహానీయులందరికీ నివాళులర్పించారు కేసీఆర్‌. స్వరాష్ట్రం సాధించుకున్న నాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే కేంద్రంగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా, ప్రణాళికాబద్ధంగా తెలంగాణా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు.

అలాగే విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ అందాల్సిన హక్కుల అమలుకు, ఆ వాతావరణాన్ని కల్పించేందుకు తమ ప్రభుత్వం గత 26 నెలలుగా ఎన్నో అడుగులు వేసిందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:    

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss