Thursday, December 2, 2021

Latest Posts

ఈ 9 వస్తువులు పుట్టింటి నుంచి అత్తింటికి అస్సలు తీసుకు వెళ్లకూడదు

9 Things Married Women Shouldn’t Bring With Them

పెళ్లి అంటే అనేక సంప్రదాయాలు, అనేక పద్ధతులు ఉంటాయి. పెళ్లి అనేది ఇద్దరి జీవితాలనే కాకుండా రెండు కుటుంబాలను కూడా కలిపేది. పెళ్లి తో అమ్మాయి తన పుట్టిన ఇంటి నుంచి అత్తవారింటికి వచ్చేస్తుంది. అయితే అమ్మాయి అలా పుట్టింటి నుంచి అత్తింటి కి వచ్చేటప్పుడు సారి అని చాలా రకాల వస్తువులు పెడుతూ ఉంటారు అయితే కొన్ని వస్తువులను అస్సలు తీసుకెళ్లకూడదట.

వాటిలో 9 ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం. పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్తున్న అమ్మాయి చీపురుని ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లకూడదు ఎందుకంటే చీపురు లక్ష్మీ దేవి స్వరూపం. కావున పుట్టింటి నుండి అత్తింటి వారి వద్దకు చీపురు తీసుకువెళ్లకూడదు. ఇక అమ్మాయి చేదు పదార్ధాలను కానీ, పుల్లటి పదార్ధాలను కానీ అత్తింటికి అస్సలు తీసుకెళ్లకూడదట. ఇలా పుల్లటి పదార్ధాలను తీసుకెళ్లడం వలన ఇరు కుటుంబాల మధ్యన మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంటుందట. అలాగే.. రెండు కుటుంబాల మధ్య బేధాభిప్రాయాలు వస్తాయట.

అందుకే ఉప్పు, చింతపండు, చింతకాయ పచ్చడి వంటివాటిని తీసుకెళ్లకూడదు. అయితే వాటిని కొంత డబ్బు ఇచ్చి తీసుకువెళ్లొచ్చని చెబుతుంది శాస్త్రం. పుట్టింటి నుంచి అత్తవారింటికి నల్లటి వస్తువులను, వస్త్రాలను తీసుకోవడం కూడా అంత మంచిది కాదట.

Chintapandu

ఇక కొంతమంది పూజ సామాగ్రిని తీసుకు వస్తూ ఉంటారు కానీ మెట్టినింటికి ఇలా తీసుకు వెల్లకూడదట. పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితిలోను పూజా సామాగ్రిని తెచ్చుకోకూడదట. దీని వల్ల కూడా లక్ష్మీ దేవిని మీ పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకు వచ్చినటే అట. కాబట్టి ఈ వస్తువులను మీ పుట్టింటి నుండి అత్తింటి వారి వద్దకు తీసుకెళ్లకుండా జాగ్రత్త పడతారు కదూ.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss