A complete lockdown has been implemented in Srikalahasti since Friday
శ్రీకాళహస్తి పేరు తలవగానే గుర్తుకు వచ్చేది ఆ మహా శివుడు. కానీ ప్రస్తుతం అక్కడ కరోనా తాండవిస్తుంది. ఏ.పి గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో చిత్తూరు జిల్లాలో 14మందికి కరోనా పాజిటివ్ గా తెలిపింది. వీరిలో శ్రీకాళహస్తికి చెందిన బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్ ఏఎస్ఐతో పాటు ఓ హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లకు పాజిటివ్ వచ్చినట్లు, అలాగే ప్రభుత్వాస్పత్రిలోని పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే ఉద్యోగినికి కూడా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. పోలీసులకు కూడా కరోనా రావడంతో అక్కడ ప్రజలు బయాందోనలకు గురియావుతున్నారు.
అనూహ్యంగ పెరిగిన పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్క సారిగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం నుంచి శ్రీకాళహస్తి లో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి సడలింపులు ఉండబోవని.. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జిల్లా కలెక్టర్ భరత్‌గుప్తా స్పష్టం చేశారు. అలా కాదని లాక్డౌన్ ను ఉల్లంగిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు అవసరమైన పాలు, మందులు, నిత్యావసరాలు ఇంటి వద్దకే వాలంటీర్లతో అందిస్తారని తెలిపారు . నిత్యావసర సరకులు, మందుల్ని అవసరమైనవారికి డోర్ డెలివరీ చేయనున్నట్లు గురువారం రాత్రి శ్రీకాళహస్తిలో పోలీస్ ఎస్కార్ట్ వాహనాలతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి, మైక్ అనౌన్స్మెంట్ చేశారు. కరోనా కట్టడిలో భాగంగా కొన్ని ఇబ్బందులు తప్పవని ప్రజలంతా సహకరించాలి అని కోరారు.