Tuesday, April 13, 2021

Latest Posts

వన్యప్రాణులకు వరంగా మారిన కరోనా

A corona that has become a boon for wildlife

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూ అన్ని రంగాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంటే, కరోనా కొందరికి వరంగా ఉంది. ముఖ్యంగా వాహనాల సంఖ్య తగ్గిపోవడంతో కాలుష్యం చాలావరకూ తగ్గిందని అంటున్నారు. నదుల్లో నీళ్లు ఎలాంటి కాలుష్యం లేకుండా ప్రవహిస్తున్నాయని అంటున్నారు. అయితే వన్య ప్రాణులకు మాత్రం కరోనా నిజంగా వరమని చెప్పాలి. ఎందుకంటే అందరూ ఇళ్లకు పరిమితం కావడం వలన ఏజన్సీ టూర్లు వంటివి లేకుండా పోయాయి. అందుకే స్వేచ్ఛగా వన్యప్రాణులు విహరిస్తున్నాయి.

ముఖ్యంగా తెలంగాణా మంచిర్యాల  కవ్వాల్‌ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవి డివిజన్‌లోని తాళ్లపేట్, జన్నారం, ఇందన్‌పల్లి అటవి రేంజ్‌లలోని అడవి ప్రాంతాల్లో అలజడి తగ్గడంతో వన్యప్రాణులు స్వేచ్ఛగా  విహరిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.  గతంలో దట్టమైన అడవిలో బిక్కుబిక్కుమంటూ ఉండే వన్యప్రాణులు కాస్త ఊరటగా బయటకు వస్తున్నాయి. స్వేచ్ఛగా తిరుగుతున్నా యి.

అంతేకాదు   ఉదయం అడవిలో అడుగుపెడితే పక్షుల కిలకిల రావాలు చెవులకు వింపుగా వినిపిస్తున్నాయని, సుదూర ప్రాంతాల నుంచి రకరకాల పక్షులు కవ్వాల్‌లోని కుంటల వద్ద పర్యటిస్తున్నట్లు అటవిశాఖ అధికారులు ఆనందంగా చెబుతున్నారు. ఇండియన్‌ స్పాట్‌ బిల్‌డ్‌ డక్, యూరేషియన్‌ వైజన్‌ పక్షి, గార్గానీడక్, కామన్‌టీల్‌ డక్, ఆసియన్‌ ఓపెన్‌బిల్, రెడ్‌ నాపెడ్‌ ఐపిస్‌ పక్షి, గ్రేహెరన్‌ పక్షి, బ్లాక్‌ వింజ్‌డ్‌ స్టిల్ట్‌ పక్షి, కామన్‌ స్టాండ్‌ పైపర్‌ పక్షి, పీఏడ్‌ కింగ్‌ ఫిషర్, క్రేస్టెడ్‌ ట్రీస్వీఫ్ట్, బ్లాక్‌ నెక్‌డ్, వుల్లి నెక్‌డ్‌ పక్షులు ఈ కవ్వాల్‌లో విహారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss